: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. పసిడి ధర రూ.650 మేర పెరగడంతో పది గ్రాముల ధర రూ.27,470 పలుకుతోంది. సీజనల్ డిమాండ్ ఎక్కువగా ఉండటం, ప్రపంచ మార్కెట్ లో మార్పుల కారణంగా బంగారానికి మరింత గిరాకీ పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. అటు, వెండి ధర రూ.1600 మేర పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.38,400 పలుకుతోంది.