: యూపీ పాఠశాలలో తుపాకి కాల్పుల మోత


ఓ పాఠశాలలో రెండు గ్రూపుల మధ్య జరిగిన తగాదా, తుపాకి కాల్పుల దాకా వెళ్ళింది. చదువుకోవాల్సిన విద్యార్థులు పెడదారి పడుతున్నారనడానికి సంకేతంగా నిలిచిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో జరిగింది. పాఠశాలలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తగా, టీనేజీ విద్యార్థి, అతడి సోదరుడు తుపాకితో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని, తాము ఇద్దరినీ అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కాగా, పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని సస్పెండ్ చేసినట్లు యాజమాన్యం తెలిపింది.

  • Loading...

More Telugu News