: సిద్ధిపేటలో హెలీపాడ్ దగ్గర మంటలు... త్రుటిలో తప్పిన ప్రమాదం


తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రయాణించాల్సిన హెలికాప్టర్ కు కాస్తంతలో ప్రమాదం తప్పింది. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన హెలీపాడ్ సమీపంలో నేటి మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. హెలీపాడ్ లో హెలికాప్టర్ ఆగి ఉండగానే ఈ ఘటన జరిగింది. దీంతో అధికారులు, భద్రతా సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హెలీపాడ్ ను ఎండుగడ్డి అధికంగా ఉన్న ప్రాంతంలో చదును చేసి ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు హెలీపాడ్ పక్కనే ఉన్న గడ్డికి నిప్పంటుకొని, అది శరవేగంగా సుమారు 10 చదరపు మీటర్ల మేరకు వ్యాపించింది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి నిప్పును అర్పివేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పినట్లయింది.

  • Loading...

More Telugu News