: సమాజ్ వాది పార్టీ యువనేతను కాల్చి చంపిన దుండగులు


హత్యాయత్నం, దోపిడీ తదితర 18 క్రిమినల్ కేసులలో నిందితుడిగా ఉన్న సమాజ్ వాది పార్టీ యువనేత ప్రదీప్ చౌదరిని ఈ ఉదయం బైక్ పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు. ఘజియాబాద్ పరిధిలోని ఇందిరాపురం, వసుంధరా కాలనీలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. తన బైక్ పై జిమ్ కు వెళ్తున్న ప్రదీప్ ను మరో బైక్ పై వెంబడించి వచ్చిన ముగ్గురు అతి సమీపం నుంచి కాల్చారు. ఆయన తలలోకి 8 బుల్లెట్లు దూసుకెళ్ళాయని ఎస్పీ శివహరి మీనా తెలిపారు. తీవ్రగాయాలైన ప్రదీప్ ను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రాణాలు పోయాయని ఎస్పీ వివరించారు. ప్రదీప్ పై వివిధ పోలీసుస్టేషన్లలో పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, ప్రదీప్ గతంలో బీఎస్పీ తరపున కౌన్సిలర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎస్పీలో చేరారు.

  • Loading...

More Telugu News