: ప్రస్తుత పేస్ విభాగం బెస్ట్ అంటున్న ఇషాంత్
ప్రస్తుత బౌలింగ్ విభాగం అత్యుత్తమమైనదని టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు. అడిలైడ్ టెస్టు ఆడుతున్న టీమిండియా పేస్ దళం అమ్ములపొదిలో అన్ని రకాల అస్త్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఆసీస్ టూర్ కు ఇషాంత్, భువనేశ్వర్, మహ్మద్ షమి, వరుణ్ ఆరోన్, ఉమేశ్ యాదవ్ ఎంపికయ్యారు. సమీప భవిష్యత్తులో ఇదే అత్యుత్తమ పేస్ విభాగం అవుతుందని అన్నాడు. పేస్ తో పాటు, ఆటను అర్థం చేసుకోగలగాలని, పరిస్థితిని బట్టి సర్దుకుపోగల సామర్థ్యం సంతరించుకోవాలని ఈ సీనియర్ బౌలర్ సూచించాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో షమి, ఆరోన్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంపై స్పందిస్తూ, ఆసీస్ ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తారన్న విషయంపై వారికి పెద్దగా అనుభవం లేదని, వారికిదే తొలి ఆసీస్ పర్యటన అని చెప్పాడు. అనుభవంతో రాటుదేలతారని తెలిపాడు.