: రెండో రోజు ఆట ముగిసింది... ఏడు వికెట్లకు 517 పరుగులు చేసిన ఆసీస్


బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 120 ఓవర్లకు గాను 517 పరుగులు చేసింది. మొత్తం ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇప్పటికే ఓపెనర్ వార్నర్ సహా కెప్టెన్ క్లార్క్, మరో స్టార్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ సెంచరీలు నమోదు చేశారు. సెంచరీ చేసిన తర్వాత క్లార్క్ ఔటైనా స్టీవ్ స్మిత్ క్రీజులోనే ఉన్నారు. ఇప్పటికే 162 పరుగులు చేసిన అతడు డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే, తొలి రోజు ఆరు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు రెండో రోజు ఒకే ఒక వికెట్ ను మాత్రమే కూల్చగలిగారు. ఆసిీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ను కరణ్ శర్మ పెవిలియన్ పంపాడు. దీంతో అతడి ఖాతాలో రెండో వికెట్ చేరింది. రెండో రోజు ఆటకు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించింది.

  • Loading...

More Telugu News