: చిరంజీవి 'ఇంద్ర'కు కాపీయే రజని 'లింగ'... కోర్టులో మరో కేసు
ఒక హీరో... తమ ప్రాంత ప్రజల నీటి అవసరాల కోసం ఓ ప్రాజెక్టును నిర్మించాలని భావిస్తాడు. ఎన్నో కష్టనష్టాలకు ఎదురు నిలిచి, సర్వం ధారపోసి ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడి ప్రజలకు దైవంగా నిలుస్తాడు. ఈ కథ ఎక్కడో విన్నట్టు, చూసినట్టు ఉందా? అదేనండి, మన చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'ఇంద్ర'. ఇప్పుడు అదే కథను కాపీ కొట్టి రజనీకాంత్ హీరోగా 'లింగ' చిత్రాన్ని నిర్మించారని, తమిళనాట 'ఇంద్ర' రీమేక్ హక్కులను కొనుగోలు చేసిన నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. చెన్నై పరిధిలోని సాలిగ్రామం ప్రాంతానికి చెందిన బాలాజీ స్టూడియోస్ ప్రైవేటు లిమిటెడ్ తరపున కార్తీక మద్రాస్ హైకోర్టులో ఈ మేరకు ఓ పిటిషన్ దాఖలు చేసారు. 2010లో తాము 'ఇంద్ర' చిత్ర హక్కులను కొనుగోలు చేశామని ఆమె వివరించారు. కార్తీక పిటీషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు, విచారణను 11కు వాయిదా వేసింది.