: తిరుమల వెంకన్నను రాజపక్స ఎందుకు దర్శించుకున్నారంటే....
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స తిరుమల వెంకన్నను ఈ ఉదయం సుప్రభాతసేవ సమయంలో దర్శించుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి కొలంబో తిరిగి వెళ్లారు. రాజపక్స తిరుమల వెంకన్నను దర్శించుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. శ్రీలంక అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన మరునాడే ఆయన వేంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చారు. మూడోసారి ఆయన అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో రాజపక్స గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని సమాచారం. ఎన్నికల్లో గెలుపొందేందుకు, వెంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం ఆయన తిరుమల వచ్చారని తెలుస్తోంది.