: ఢిల్లీలో బంగ్లా ఖాళీ చేసిన చిరంజీవి
పదవుల్లో ఉన్నంత వరకే బంగ్లాలు, భద్రత, మందీమార్బలం! పదవి పోయిన మరుక్షణం అన్నీ పోతాయి! యూపీఏ హయాంలో పర్యాటక మంత్రిగా ఓ వెలుగు వెలిగిన నటుడు చిరంజీవి ఇప్పుడు మాజీగా మిగిలారు. రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నా, మంత్రి హోదాలో అందుకున్న సౌకర్యాలు మాత్రం దూరమయ్యాయి. తాజాగా, ఢిల్లీలోని బంగ్లాను కూడా ఖాళీ చేశారు. మంత్రిగా వ్యవహరించిన కాలంలో అక్బర్ రోడ్డులోని నెం.17 బంగ్లాను చిరంజీవికి కేటాయించారు. అయితే, కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నేపథ్యంలో, బంగ్లాను ఖాళీ చేయాలంటూ చిరంజీవికి నోటీసులు పంపారు. ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో, చివరికి అధికారులు నోటీసులను బంగ్లా గేటు వద్ద అంటించారు. దీంతో, ఆయనకు బంగ్లా ఖాళీ చేయకతప్పలేదు. రెండు ట్రక్కుల్లో సామానంతటినీ హైదరాబాద్ తరలించినట్టు తెలుస్తోంది. చిరంజీవి ఖాళీ చేసిన ఈ బంగ్లాను హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కేటాయించారు. అటు, రాజ్యసభ సభ్యుడి హోదాలో చిరంజీవికి తుగ్లక్ రోడ్డులో ఓ బంగ్లాను కేటాయించారట.