: 20న ప్రజలతో చంద్రబాబు లైవ్ చాటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 20వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు ప్రజలతో లైవ్ చాటింగ్ చేయనున్నారు. చంద్రబాబుతో లైవ్ చాట్ చేయాలనుకునే వారు ఈ నెల 16వ తేదీలోగా సూచనలు, ప్రశ్నలు పోస్ట్ చేయాలని ముఖ్యమంత్రి తన ఫేస్‌బుక్ పేజీలో కోరారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ఖాతాలున్న వారు ఈ చర్చలో పాల్గొనవచ్చు. సామాజిక వెబ్ సైట్లలో ఉన్న పేజీలు (#AskCBN or #AskAPCM ) లలో ప్రశ్నలు అడగవచ్చు. మరిన్ని వివరాలకు http://chandrababunaidu.com వెబ్ సైట్ చూడాలని బాబు క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.