: కోట్లకు పడగలెత్తిన బాబా రాంపాల్ వద్ద బెయిల్ కు రూ.20 వేలు లేవట!


స్వర్గలోకపు ప్రవేశానికి ఒక్కో టికెట్ ను రూ.1 లక్షకు విక్రయించిన బాబా రాంపాల్ వద్ద ప్రస్తుతం చిల్లి గవ్వ కూడా లేదట. అయినా జైల్లో ఉంటే ఆయన వద్ద డబ్బెలా ఉంటుందని లాజిక్ తీయకండి. ఎందుకంటే, జైలులో ఉన్న ఆయనకు ఖర్చులేమీ లేవు కాని బెయిల్ కోసమైనా డబ్బు కావాల్సిందేగా. ప్రస్తుతం తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను అడ్డగించిన కేసులో కోర్టు రాంపాల్ కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనకు జామీను ఇచ్చి బయటకు తీసుకెళ్లేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదట. అసలు జామీను విలువెంతో తెలుసా, కేవలం రూ.20 వేలు మాత్రమే. కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టిన రాంపాల్ వద్ద రూ.20 వేలు కూడా లేవా అంటే, లేవట మరి. అందుకే ఆయన బెయిల్ లభించినా జైల్లోనే గడుపుతున్నారట. ఇదిలా ఉంటే, అధికారులను అడ్డగించిన కేసులో బెయిల్ మంజూరైనా, రాంపాల్ మీద ఇతర సెక్షన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే, ప్రస్తుతం మంజూరైన బెయిల్ పై రాంపాల్ విడుదలైనా మళ్లీ అరెస్ట్ కావడం ఖాయం. ఈ నేపథ్యంలో అనవసరంగా డబ్బును తగలేయడం ఎందుకని బాబా రాంపాల్ రూ.20 వేలు లేవని చెబుతున్నారన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News