: నిషేధమున్నా, పనిచేస్తున్న ఉబెర్ క్యాబ్స్
దేశ రాజధాని ఢిల్లీలో ఉబెర్ క్యాబ్స్ పై నిషేధం విధించినా ఆ సంస్థ ఆన్ లైన్, మొబైల్ యాప్ ద్వారా సేవలను కొనసాగిస్తూనే ఉంది. క్యాబ్ డ్రైవర్ లకు ఉబెర్ యాజమాన్యం నిషేధం గురించిన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. మొబైల్ యాప్ ను ఉపయోగించి క్యాబ్ కావాలని ఓ జాతీయ టెలివిజన్ చానల్ ప్రతినిధి కోరితే ఎటువంటి లోగో, బ్యాడ్జీ లేకుండా ఓ కారు వచ్చింది. తాను ఉబెర్ కార్యాలయానికి ఫోన్ చేసి అడుగగా, ఇష్టమైతే సర్వీసులను కొనసాగించవచ్చు అని చెప్పినట్టు క్యాబ్ డ్రైవర్ వివరించడం గమనార్హం.