: బీసీసీఐలో కొనసాగనివ్వండి... ఐపీఎల్ లో కలుగజేసుకోను: సుప్రీంకు విన్నవించిన శ్రీని
అల్లుడు మేయప్పన్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ అంశాలు ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ కు సంకటంగా మారాయి. స్పాట్ ఫిక్సింగ్ అంశం శ్రీనిని ముందుకు వెళ్లనివ్వకుండా వెనుకకు లాగుతోంది. ఈ క్రమంలో, ఐపీఎల్ లేదా బీసీసీఐ... ఏదో ఒకటి తేల్చుకోవాలని శ్రీనివాసన్ కు సుప్రీంకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో, తాను ఐపీఎల్ కు పూర్తిగా దూరంగా ఉంటానని... సుప్రీంకోర్టు అనుమతి లభించేంత వరకు ఐపీఎల్ వ్యవహారాల్లో కలుగజేసుకోనని సర్వోన్నత న్యాయస్థానానికి శ్రీనివాసన్ స్పష్టం చేశారు. బీసీసీఐలో తనను కొనసాగేలా చూడాలని సుప్రీంను కోరారు.