: ప్రశ్నాపత్రం 'వాట్స్ యాప్' లో లీకైంది!


అందివచ్చిన టెక్నాలజీ సాయంతో విపరీత చర్యలకు పాల్పడుతున్నారు కొందరు. తాజాగా, ఢిల్లీలో ప్రశ్నాపత్రాన్ని 'వాట్స్ యాప్' లో లీక్ చేశారు. ఢిల్లీ యూనివర్శిటీకి అనుబంధంగా పనిచేసే శ్రీగురు తేజ్ బహదూర్ ఖల్సా కాలేజీలో బయాలజీ పరీక్ష పేపర్ కాస్తా విద్యార్థుల స్మార్ట్ ఫోన్లలో ప్రత్యక్షమైంది. పరీక్ష హాలు బయట విద్యార్థులు మొబైల్ ఫోన్లలో ఏదో ఆత్రుతగా చూస్తుండడాన్ని ఇన్విజిలేటర్లు గమనించారు. వెళ్లి వారి ఫోన్లను పరిశీలించగా, క్వశ్చన్ పేపర్ కనిపించింది. దీనిపై ఇన్విజిలేటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా, ఢిల్లీ యూనివర్శిటీ పరీక్షల విభాగానికి కూడా సమాచారం అందించారు. అయితే, పరీక్ష మొదలైన తర్వాతే విద్యార్థుల ఫోన్లలో ప్రశ్నాపత్రం సర్క్యులేట్ అయిందని ఓ ఇన్విజిలేటర్ తెలిపారు. ఈ ఉందంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News