: దొంగబాబాకు పోలీసుల హెచ్చరిక


కరీంనగర్‌ జిల్లాలో రోగాలు నయం చేస్తానంటూ, అమాయకుల నుంచి వేలాది రూపాయలను వసూలు చేసిన హస్తం ప్రభు అనే ఓ దొంగ బాబాను మద్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గల్లీలలో తిరుగుతూ దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని రుక్మీణిబాయి అనే మహిళ వద్ద రూ.2 వేలు తీసుకొని ఎందుకూ పనికిరాని తాయత్తులు ఇచ్చాడు. అలాగే మరికొంతమందిని మోసం చేశాడు. కొన్ని రోజులుగా దొంగతనాలు ఎక్కువ కావడంతో, ఈ బాబాపై స్థానికులు అనుమానం వ్యక్తం చేసి, పోలీసులకు సమాచారం అందించారు. తాను బతుకుదెరువు కోసం ఊర్లు తిరుగుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూ తాయత్తులు ఇస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో హస్తం ప్రభు అంగీకరించాడు. బాధితుల వద్ద తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించిన పోలీసులు, మళ్లీ ఇలాంటి మోసాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించి హస్తం ప్రభును వదిలేశారు.

  • Loading...

More Telugu News