: అమీర్ ఖాన్ 'పీకే'పై ఫెదరర్ ఉత్సుకత
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పీకే' చూసేందుకు అంతర్జాతీయ టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ చాలా ఆశగా ఎదురుచూస్తున్నాడట. ఐపీటీఎల్ కోసం భారత్ వచ్చిన ఫెదరర్ ఇటీవల మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ తో సరదాగా టెన్నిస్ ఆడాడు. అదే సమయంలో 'పీకే' గురించి అమీర్ తో చర్చించాడట. "అమీర్ ను రోజర్ కలసిన సమయంలో ముందు 'పీకే' పోస్టర్ గురించే మాట్లాడాడు. అసలా పోస్టర్ వెనకున్న ఐడియా గురించి కూడా తెలుసుకోవాలని చాలా ఎగ్జైట్ అయ్యాడు. అంతేగాక ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు చూడాలనుకుంటున్నట్టు అమీర్ తో చెప్పాడు" అని అమీర్ అధికార ప్రతినిధి ఒకరు ఓ ప్రకటనలో వివరించారు. అనుష్క శర్మతో కలసి నటించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలకానుంది.