: మ్యాచ్ ను మరోసారి అడ్డుకున్న వరుణుడు... ఆసీస్ 473/6
ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజున వరుణుడి పలకరింపులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే వర్షం రాకతో ఒకసారి ఆగి మళ్లీ కొనసాగుతున్న ఆటను... మరోసారి వర్షపు జల్లులు అడ్డుకున్నాయి. పిచ్ పై కవర్లను కప్పేశారు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 473 పరుగులు. స్టీవెన్ స్మిత్ 142, క్లార్క్ 109 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లు ఈ రోజు వికెట్ తీయడంలో విఫలమయ్యారు. 131 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్మిత్ ను స్టంపింగ్ చేసే అవకాశాన్ని భారత్ చేజార్చుకుంది. కరణ్ శర్మ విసిరిన ఫైటెడ్ డెలివరీని స్మిత్ మిస్ అయి, క్రీజు బయటకు వెళ్లాడు. స్టంపింగ్ ఛాన్స్ వచ్చినప్పటికీ కీపర్ సాహా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో, స్మిత్ బతికిపోయాడు.