: మోదీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు


ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచార ప్రసంగంలో భాగంగా రాజకీయ వివాదంలోకి ఆర్మీని తీసుకొచ్చారంటూ తెలిపింది. ఈ నేపథ్యంలో పీఎంపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. "రాజకీయ వివాదంలోకి ఆర్మీని తీసుకురావడం లేదా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడం అత్యంత అభ్యంతరకరం. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద మోదీపై లేదా బీజేపీపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఏఐసీసీ న్యాయ విభాగ కార్యదర్శి కేసీ మిట్టల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక మోదీ ప్రసంగంలో బదౌన్ ఘటనను ప్రస్తావించడాన్ని కూడా అందులో పేర్కొన్న కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. దాన్ని కూడా ప్రచార సాధనంగా ప్రధాని ఉపయోగించుకోవడం సరికాదని సూచించింది.

  • Loading...

More Telugu News