: భారత్ లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ నియామకం


భారత్ లో అమెరికా తదుపరి రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ నియమితులయ్యారు. కొన్ని రోజుల నుంచే ఈ పదవికి రిచర్డ్ పేరును అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిశీలిస్తున్నారని తెలిసింది. అయితే, అమెరికా సెనేట్ ఆయన నియామకానికి వాయిస్ ఓటు ద్వారా ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన నియామకాన్ని తాజాగా సెనేట్ ధ్రువీకరించింది. దాంతో, భారత సంతతికి చెందిన తొలి అమెరికా రాయబారిగా ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ హయాంలో ఆమెకు కీలక సహాయకుడిగా 46 ఏళ్ల వర్మ పనిచేశారు. కాగా, త్వరలో భారత్ లో ఒబామా పర్యటించనున్న క్రమంలో ముందుగానే రాయబార బాధ్యతలను వర్మ చేపట్టే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News