: జయలలిత బెయిల్ మంజూరు ముడుపులపై విచారణకు సుప్రీం నో!


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ మంజూరు విషయంలో వెల్లువెత్తిన ముడుపుల ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ముడుపుల వ్యవహారంపై విచారణ జరపలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు సోమవారం ప్రకటించారు. జయలలితకు బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనానికి జస్టిస్ దత్తునే నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే. జయలలితకు బెయిల్ మంజూరు చేసేందుకు జస్టిస్ దత్తు, రూ. 1,000 కోట్ల లంచం తీసుకున్నారని, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని తమిళనాడుకు చెందిన న్యాయవాది ఆర్.కృష్ణమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ దత్తు, ముడుపుల వ్యవహారంపై విచారణ చేపట్టలేమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘‘ఈ విషయాన్ని నేను చూసుకుంటాను. ఇలాంటి ఆరోపణలు నాకు కొత్తేమీ కాదు. డోంట్ వర్రీ’’ అంటూ వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసులో పదేళ్ల జైలు శిక్ష పడ్డ జయలలితకు కర్ణాటక హైకోర్టు బెయిల్ నిరాకరించిన తర్వాత సుప్రీంకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News