: రీచార్జ్ కార్డులు కొనే లోపు నటీమణి లగేజి మాయమైంది!


బాలీవుడ్ వర్ధమాన నటి మనస్వి మాంగాయ్ కు చేదు అనుభవం ఎదురైంది. 'యాక్షన్ జాక్సన్' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఓ పార్టీ కోసం హాంకాంగ్ వెళ్లింది. ఆ పార్టీకి హృతిక్ రోషన్, బిపాషా బసు, మలైకా అరోరా ఖాన్ వంటి స్టార్లు హాజరయ్యారట. కాగా, హాంకాంగ్ లో అడుగుపెట్టిన అనంతరం, ఎయిర్ పోర్టు వెలుపలికి వచ్చి, ఫోన్ రీచార్జ్ కార్డులు కొనుగోలు చేసేందుకు మనస్వి ఓ షాపుకు వెళ్లింది. తిరిగి వచ్చేలోపు లగేజి మాయమైంది. దాంట్లో విలువైన ఆభరణాలు, ఖరీదైన డిజైనర్ దుస్తులు ఉన్నాయట. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే, ఘటన విమానాశ్రయం బయట జరగడంతో, దొంగ ఎటువెళ్లాడన్నది తెలుసుకోవడం కష్టమని పోలీసులు అంటున్నారు. పాపం, అమ్మడు సంతోషం కాస్తా దొంగతనంతో ఆవిరైపోయింది!

  • Loading...

More Telugu News