: క్లార్క్ సెంచరీ... భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా


అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా కదులుతోంది. నిన్న వెన్ను నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన కెప్టెన్ క్లార్క్ ఈ రోజు శతకాన్ని పూర్తి చేశాడు. 127 బంతులు ఎదుర్కొన్న క్లార్క్ 15 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది 28వ శతకం. మరోవైపు 104 పరుగులతో స్టీవెన్ స్మిత్ పరుగుల వేటను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 6 వికెట్ల నష్టానికి 426 పరుగులు. 550 పరుగులకు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News