: ఉగ్రవాదంపై సమర్థంగా పోరాడేందుకే పాక్ కు సాయం చేశాం: పుతిన్


ఇటీవల పాకిస్థాన్ కు తాము సైనికపరమైన సాయం చేయడం వల్ల భారత్-రష్యా సంబంధాల్లో ఎలాంటి మార్పు రాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. కేవలం ఉగ్రవాదంపై మరింత సమర్థంగా పోరాడేందుకే ఈ సాయం చేశామని చెప్పుకొచ్చారు. భారత్-రష్యాలు అన్ని రకాలుగా సహజ మిత్రులని అన్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు పుతిన్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన పై వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అనేకసార్లు రష్యా పర్యటించారని.... రెండు దేశాల స్నేహానికి చాలా కృషి చేశారని చెప్పారు.

  • Loading...

More Telugu News