: మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం
మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన సదరు విద్యార్థినులు సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో పాఠశాల వద్ద వాకబు చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.