: ఊరంతటికీ కరెంటు షాక్‌... యువకుడి మృతి... పలువురికి గాయాలు


ఊరంతటికీ ఒకేసారి కరెంటు షాక్‌ కొట్టింది. గోడలు పట్టుకుని ఉన్నవారికి, నీళ్ళను తాకిన వారికి ఒక్కసారిగా ఒళ్లు జిల్లుమంది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం కోనాయపల్లి (పీటీ)లో ఈ ఘటన చోటుచేసుకోగా ఓ యువకుడు మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. సింగిల్ ‌ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఎర్తింగ్‌ లోపం కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో చెట్లగౌరారం సబ్‌స్టేషన్‌ వద్ద మూడు గంటల పాటు ఆందోళన చేపట్టారు. కొందరు యువకులు కార్యాలయంపై దాడిచేశారు. దీంతో సబ్‌ స్టేషన్‌లోని ఫర్నీచర్‌, అద్దాలు, ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం అయ్యాయి. బాధిత కుటుంబసభ్యులకు పరిహారం అందేలా చేస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

  • Loading...

More Telugu News