: తిరుమలలో భారీ వర్షం... నీట మునిగిన తిరువీధులు
నెల్లూరు జిల్లాను కుదిపేస్తున్న భారీ వర్షం తాజాగా తిరుమలకూ చేరింది. నేటి ఉదయం ప్రారంభమైన వర్షం కారణంగా శ్రీవారి ఆలయ పరిసరాలు సహా తిరుమల వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షం కారణంగా మరిన్ని ప్రాంతాలు నీటమునిగాయి. నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లోని రహదారులపై నీరు నిలిచిపోయింది. దీంతో నగర ప్రజలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.