: ఉబెర్ క్యాబ్స్ పై తెలంగాణలో నిషేధం!


దేశ రాజధాని ఢిల్లీలో మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి పాల్పడ్డ తమ డ్రైవర్ దుశ్చర్య కారణంగా ఉబెర్ క్యాబ్స్ తీవ్ర సంకట స్థితిని ఎదుర్కుంటోంది. అత్యాచార ఘటన నేపథ్యంలో అనుమతి లేని వెబ్ ఆధారిత క్యాబ్ సర్వీసులను నిషేధించాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఉబెర్ క్యాబ్స్ పై ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నిషేధం అమలవుతోంది. తాజాగా తెలంగాణలోనూ ఉబెర్ క్యాబ్ సేవలను నిషేధిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉబెర్ క్యాబ్ సేవలను నిషేధిస్తూ రవాణా శాఖ కమిషనర్ జగదీశ్వర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహన యజమానులు, డ్రైవర్లు సదరు సంస్థతో ఎలాంటి సంబంధాలు నెరపరాదని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

  • Loading...

More Telugu News