: నెల్లూరు జిల్లాలో భారీ వర్షం... పలు ప్రాంతాలు జలమయం
నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలోని తడ, సూళ్లురుపేటల్లో పడుతున్న వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి మొదలైన వర్షం నేటి ఉదయం వరకు కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాగం అప్రమత్తమైంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా యోచిస్తున్నారు.