: నేడు సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు తన సొంతూరు సిద్దిపేటలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సిద్దిపేటకు వస్తున్న ఆయన పలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. సిద్దిపేట పరిధిలోని చింతమడక కేసీఆర్ సొంత గ్రామమన్న విషయం తెలిసిందే. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సిద్దిపేటలోని మంచి నీటి పథకంపై కేసీఆర్, తన కేబినెట్ సహచరులకు అవగాహన కల్పించనున్నారు. అనంతరం సీఎం కరీంనగర్ జిల్లాలోనూ పర్యటిస్తారు.