: నేడు సత్యార్థి, మలాలాలకు నోబెల్ శాంతి బహుమతి ప్రదానం


బాలల హక్కుల ఉద్యమకర్త కైలాశ్ సత్యార్థి, పాకిస్థాన్ బాలికల విద్యా హక్కు ఉద్యమకారిణి మలాలా యూసుఫ్ జాయ్ నేడు నోబెల్ శాంతి బహుమతిని అందుకోనున్నారు. ఓస్లోలో నేడు జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరికీ నోబెల్ కమిటీ అవార్డును అందజేయనుంది. బాలల హక్కులపై మూడు దశాబ్దాలుగా అలుపెరగని పోరు సాగిస్తున్న సత్యార్థిని ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ బాలికల విద్య కోసం ఉగ్రవాదులకు ఎదురొడ్డి పోరు సాగిస్తున్న మలాలా యూసుఫ్ జాయ్ కి సత్యార్థితో కలిపి ఉమ్మడిగా నోబెల్ కమిటీ శాంతి బహుమతిని ప్రకటించింది. వీరిద్దరూ మంగళవారమే ఓస్లో చేరుకున్నారు. నేడు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న తర్వాత వారు తిరిగి తమ తమ దేశాలకు బయలుదేరనున్నారు.

  • Loading...

More Telugu News