: తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభం...నిలకడగా ఆసిస్ బ్యాటింగ్
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు రెండో రోజు ఆట కొద్దిసేపటి క్రితం మొదలైంది. అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఆసిస్ బ్యాట్స్ మన్ భారీ స్కోరు దిశగా సాగుతున్నారు. ప్రస్తుతం ఆరు వికెట్లు కోల్పోయిన ఆసిస్ 401 పరుగులు చేసింది. తొలి రోజు ఆటలో వార్నర్ సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో స్టీవ్ స్మిత్ సెంచరీకి చేరువయ్యాడు. ఇక తొలిరోజు ఆటలో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన కెప్టెన్ క్లార్క్ రెండో రోజు ఆటలో మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 85 పరుగులు చేసిన అతడు సెంచరీ దిశగా సాగుతున్నాడు.