: జనవరి 23, 24, 25న విశాఖ ఉత్సవ్: మంత్రి గంటా
హుదూద్ కారణంగా పేరు ప్రతిష్ఠలపై నీలి నీడలు కమ్ముకున్న దశలో విశాఖ ప్రతిష్ఠను పెంచే విధంగా విశాఖ ఉత్సవాలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖపట్టణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, జనవరి 23, 24, 25 తేదీల్లో విశాఖ ఉత్సవ్ ను నిర్వహించనున్నామని అన్నారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొంటారని ఆయన తెలిపారు. విశాఖ ప్రజల ఆత్మవిశ్వాసంపై హుదూద్ ప్రభావం లేదని నిరూపించడమే విశాఖ ఉత్సవ్ నిర్వహించడం వెనుక ప్రధానోద్దేశ్యమని ఆయన వెల్లడించారు.