: కోట్ల విలువ చేసే రాముడు, హనుమంతుడి విగ్రహాలు చోరీ


కోట్ల రూపాయల విలువ చేసే పురాతన విగ్రహాలను ఆగంతుకులు ఎత్తుకెళ్లిన సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలోని రఘునాథ్ జీ దేవాలయంలోని పురాతన విగ్రహాలు చోరీకి గురైనట్టు ఆలయాధికారులు గుర్తించారు. కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, వెండితో తయారు చేసిన రాముడు, హనుమంతుడు విగ్రహాలు, బంగారు గొలుసు, వెండి గణేషుడి విగ్రహాలను దుండగులు అపహరించుకుని పోయారని వారు వివరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసు కనుక దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు.

  • Loading...

More Telugu News