: జగన్ కు ఆమాత్రం తీరిక లేదా?: యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వివరాలు వెబ్ సైట్లో పెట్టాలంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయ, వ్యయాలని ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఉంచుతున్నామని అన్నారు. వాటిని చూసుకునేంత తీరిక జగన్ కు లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల హామీలు అమలు చేయడం లేదంటూ జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెప్పిన ఆయన, ఎన్నికల్లో జగన్ అక్రమంగా సంపాదించిన సొమ్మును కూడా రికవరీ చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు.