: కైలాష్ సత్యార్థి, మలాలా ఉమ్మడి సమావేశం
నోబెల్ శాంతి బహుమతి విజేతలు, బాలల హక్కుల కార్యకర్తలు కైలాష్ సత్యార్థి, మలాల యుసుఫ్ జాయ్ లు ఓస్లోలో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ, నోబెల్ బహుమతి అందుకోవడం ఓ అద్భుతమైన అవకాశమని అన్నారు. సత్యార్థి మాట్లాడుతూ, బాలల హక్కుల కోసం పోరాడడంలో యువతను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్య కోసం మాలాలా పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శవంతమని ఆయన సూచించారు. మలాలా మాట్లాడుతూ, తాము పెన్ను, పుస్తకం మాత్రమే అడుగుతున్నామని అన్నారు. విద్య అందక బాలలు తమ భవిష్యత్ ను సరైన దిశలో మలచుకోలేకపోతున్నారని తెలిపారు. తాము పిల్లలకు ఐపాడ్లు కావాలని సూచించడం లేదని, కేవలం వారికి అవసరమైన పెన్ను, పుస్తకాలు ఇస్తే చాలని వారు సూచించారు. కాగా రేపు వీరిద్దరూ ఓస్లోలో నోబెల్ పురస్కారం సంయుక్తంగా అందుకోనున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య శాంతి నెలకొనాలని వీరిద్దరూ ఆకాంక్షించారు.