: తిరుపతి చేరుకున్న రాజపక్స... వైగో అభిమానుల అరెస్టు
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స తిరుపతి చేరుకున్నారు. తిరుమల శ్రీవారికి రాజపక్స మంచి భక్తుడు. వెంకన్నను గతంలో పలుమార్లు దర్శించుకున్నారు. ఆయన రాక నేపథ్యంలో తమిళనేత వైగో ఆయనను అడ్డుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దీంతో తమిళనాడు నుంచి విడతలుగా వైగో అభిమానులు భారీ సంఖ్యలో తిరుమల చేరుకుంటున్నారు. రాజపక్సను తమిళులు అడ్డుకోనున్నారనే సమాచారంతో, తిరుమలలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయన శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే రహదారుల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, రాజపక్స వెనక్కి వెళ్లాలంటూ తిరుపతిలో ఆందోళన చేపట్టిన వైగో అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు. కాగా, రాజపక్స రేపు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొంటారు.