: జగన్ ఎప్పటికీ 420నే అంటున్న మహిళా మంత్రి


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనం తనను ఈ ఐదేళ్లలో మరచిపోతారని భయపడే రుణమాఫీ పేరిట ధర్నాలు చేస్తున్నారన్నారు. రైతులపై మాట్లాడే హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కడిగిన ముత్యమైతే, జగన్ ఎప్పటికీ 420నే అని విమర్శించారు. బాబు రైతులను ఆదుకుంటే, ఆయన మాత్రం విమర్శలు చేస్తున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చరిత్ర అంతా హత్యలు, దోపిడీలేనని ఆరోపించారు. తొలి దశ రుణమాఫీ జాబితాలోని 22 లక్షల మందిలో 6 లక్షల మంది అనంతపురం వాసులున్నారని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News