: తిరుమలలో అంగప్రదక్షిణ టోకెన్ల జారీ రద్దు


శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన నేపథ్యంలో అంగప్రదక్షిణ టోకెన్ల జారీని రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే కొన్ని ఆంక్షలు విధించామని వివరించారు. ప్రోటోకాల్‌ పరిధిలోని వీఐపీలకు మాత్రమే బుధవారం సుప్రభాత సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. బుధవారం సుప్రభాత సేవలో తిరుమల శ్రీవేంకటేశ్వరుణ్ణి రాజపక్స దర్శించుకోనున్న సంగతి తెలిసిందే. తిరుమల నుంచి రాజపక్స వెళ్లేవరకు ఆంక్షలు ఉంటాయని, తరువాత ఎప్పటిలానే స్వామి వారి దర్శనం కొనసాగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా, రాజపక్సను అడ్డుకొనేందుకు తమిళులు తిరుమలకు వస్తున్నట్లు సమాచారం. అయితే, వారిని అడ్డుకొనేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

  • Loading...

More Telugu News