: వైద్యుడిగా సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నా: కోడెల
స్పీకర్ గా ఉన్నప్పటికీ వృత్తి రీత్యా వైద్యుడినైన తాను సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నానని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తరాలుగా కొనసాగుతున్న బహిరంగ మలవిసర్జన అలవాటును నిర్మూలించడమే లక్ష్యంగా, సత్తెనపల్లి నియోజకవర్గంలో 22 వేల మరుగుదొడ్లను నిర్మించామని అన్నారు. 'స్వచ్ఛ భారత్' ద్వారా సామాజిక రుగ్మతలు తొలగిపోతాయని ఆయన స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రంలో మూడు రోజుల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నామని, దానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఆహ్వానించామని ఆయన తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ లో అనేక అంశాలపై చర్చ జరుగుతుందని, న్యాయపరమైన అంశాలు కూడా చర్చకు వస్తాయని ఆయన వివరించారు. చర్చల ద్వారా సమాజానికి ఒక సందేశం ఇవ్వవచ్చని ఆయన పేర్కొన్నారు.