: ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ చేతికి వస్తుంది: మంత్రి నారాయణ


ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ ఆరు నెలల్లో ప్రభుత్వం చేతికి వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. సింగపూర్ ప్రతినిధులతో ఏరియల్ సర్వే నిర్వహిస్తామని చెప్పారు. రాజధాని ప్రాంతంలో వనరులు, భౌగోళిక పరిస్థితుల గురించి సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. సింగపూర్ ప్రతినిధి బృందం గతంలో చైనాలో చేపట్టిన నిర్మాణాల గురించి వివరించిందని ఆయన తెలిపారు. రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేయనున్నామని ఆయన వివరించారు. ఈ కమిటీలో సింగపూర్ ప్రతినిధులు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ముగ్గురు ఉంటారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News