: జగన్, రఘువీరాలను నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు: ముద్దుకృష్ణమ నాయుడు


వైకాపా అధినేత జగన్, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిలపై టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాన్ని అక్రమంగా విభజించడానికి వీరిద్దరూ కారకులని ఆరోపించారు. వీరిద్దరూ గత పదేళ్లుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని... అక్రమ దోపిడీలు, ఎర్రచందనం మాఫియా, ఇసుక మాఫియా అన్నీ జగన్ కనుసన్నల్లోనే నడిచాయని అన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ సంపాదించిన 43వేల కోట్ల ఆస్తిని జప్తు చేస్తే రైతుల రుణమాఫీ చేయవచ్చని మండిపడ్డారు. వీరిద్దరినీ నడిరోడ్డు మీద ఉరితీసినా తప్పు లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News