: తమిళనాట నడుస్తోంది అమ్మ పాలనే: అసెంబ్లీలో పన్నీర్ సెల్వం
తమిళనాడు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూర్చున్న సీట్ ఖాళీగానే ఉంచి, పక్కన కూర్చొని పాలన సాగిస్తున్న ఓ.పన్నీర్ సెల్వం నేడు మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఏఐఏడీఎంకే చీఫ్ మాత్రమేనని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. తమిళనాట శాంతిభద్రతలు క్షీణించాయని సీపీఎం నేత సౌందరరాజన్ ఆరోపించగా, జయలలిత నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని సుపరిపాలనకు ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. పన్నీర్ సెల్వం వ్యాఖ్యలను డీఎంకే తీవ్రంగా ఖండించింది.