: ఈసారి భారీగా తగ్గనున్న పెట్రోల్ ధర!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఐదు సంవత్సరాల కనిష్టానికి దిగజారాయి. నేటి యూఎస్ ట్రేడింగ్ లో ముడిచమురు ధర బ్యారల్ కు క్రితం ముగింపుతో పోలిస్తే 4 శాతం పడిపోయి 63 డాలర్ల వద్ద కొనసాగింది. గత జూలై నుంచి పరిశీలిస్తే క్రూడాయిల్ ధరలు 40 శాతం తగ్గాయి. దేశవాళీ మార్కెట్లో అంతర్జాతీయ ధరలను అనుసరించి పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తుండటంతో, మరో వారంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ దఫా పెట్రోలు ధర లీటరుకు రూ.2 నుంచి 3 వరకు తగ్గే అవకాశాలున్నాయి.