: యూట్యూబ్ లో అజిత్ కొత్త సినిమా టీజర్ రికార్డు


అజిత్ కథానాయకుడిగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న 'ఎంతవాడు గాని' (తమిళంలో ఎన్నై అరిందల్) చిత్రం విడుదలకు ముందే యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. టీజర్ విడుదలైన 48 గంటల్లోనే 20 లక్షల మంది వీక్షించగా, ఇప్పుడది 30 లక్షలకు చేరింది. ఇటీవలి కాలంలో ఏ దక్షిణాది సినిమా టీజర్ కూ ఇలాంటి రికార్డు దక్కలేదు. అనుష్క, త్రిష కథానాయికలుగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News