: అభ్యర్థిస్తే... కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సహాయం చేస్తాం: బాన్ కీ మూన్
కాశ్మీర్ అంశంపై భారత్, పాకిస్థాన్ ల మధ్య కొంతకాలంగా చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో సమస్య పరిష్కరించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఓ ఒప్పందం ప్రకారం, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా కాశ్మీర్ విషయంపై చర్చించి పరిష్కార సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తన నిర్ణయాన్ని తెలిపారు. అదీ రెండు దేశాలు తమను కోరితేనే అన్నారు. "గతంలో నేను చెప్పినట్టుగా, రెండు దేశాలు విజ్ఞప్తి చేస్తే ఈ సమస్య పరిష్కరించడంలో మా వంతు సహాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని బాన్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో శాంతి పునరుద్ధరించాలంటే అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. అందుకే ఇరు దేశాలు చర్చలను పునరుద్ధరించాలని చెప్పారు. కాశ్మీర్ పై ఓ ఒప్పందం చేసుకుంటే రెండు దేశాలకు, ఆ ప్రాంతాల భద్రతకు బాగుంటుందని సూచించారు.