: నలుగురు చిన్నారుల తలలు నరికిన ఐఎస్ ఉగ్రవాదులు
ముస్లిం మతంలోకి మారేందుకు అంగీకరించని నలుగురు క్రిస్టియన్ చిన్నారులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తలలు నరికి చంపారు. ఈ ఘటన ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలో జరిగింది. క్రిస్టియన్ మతస్తులను ఇరాక్ నుంచి తరిమికొట్టాలన్నదే ఐఎస్ ఉద్దేశమని, తీవ్రవాదులు నిర్దయగా వ్యవహరించారని ఆ ప్రాంత క్రిస్టియన్ నేత ఆండ్రూ వైట్ తెలిపారు. ఉగ్రవాదులు ఇప్పటికే వందల మందిని హతమార్చారని ఆయన అన్నారు. పెద్దలు మతం మారకుంటే వారి పిల్లలను చంపుతున్నారని ఆరోపించారు.