: భార్యలు పెట్టే తప్పుడు కేసులతో కాపురాలు నాశనం: సుప్రీంకోర్టు


భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498-ఏను వాడుతూ మహిళలు పెడుతున్న తప్పుడు కేసుల సంఖ్య పెరిగిపోతున్నదని, ఆ తరువాత మహిళలు పశ్చాత్తాప పడ్డా తమ కాపురాలు నిలుపుకోలేకపోతున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, ఏ.కే. సిక్రీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒకసారి తప్పుడు కేసు పెట్టిన తరువాత కాపురం నిలవడం లేదని వారు అభిప్రాయపడ్డారు. "ఎటువంటి తప్పు చేయకుండానే ఆడపడుచులు, భర్త తల్లిదండ్రులను సెక్షన్ 498-ఏ ఉపయోగిస్తూ జైళ్లకు పంపడం వివాహ వ్యవస్థను దెబ్బతీస్తోంది" అని ఓ కేసును విచారించిన సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులను, సోదరినీ జైలులో చూసిన తరువాత భార్య ఎంత పశ్చాత్తాపం వ్యక్తం చేసినా తిరిగి కాపురం నిలవడం లేదని వారు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News