: చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ


ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో వ్యవహరించాల్సిన తీరుపై వారు ఈ సందర్భంగా చంద్రబాబుతో చర్చిస్తున్నట్లు సమాచారం. అంతేకాక తెలంగాణ సర్కారు వద్ద ఏయే అంశాలను ప్రస్తావించాలన్న అంశంపైనా వారు చంద్రబాబుతో సమాలోచనలు జరుపుతున్నారు. చంద్రబాబుతో భేటీ అయిన వారిలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులున్నారు. తెలంగాణలో నెమ్మదిగా సాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు అంశంపైనా చంద్రబాబు వారితో ప్రస్తావించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News