: ఏపీ క్రీడా కేంద్రంగా గుంటూరుకే ఛాన్స్
కొత్త రాష్ట్రంలో పలు సంస్థలు, కార్యాలయాలు మొదలైన వాటిని నెలకొల్పేందుకు గుంటూరుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా నవ్యాంధ్రలో క్రీడా కార్యకలాపాలకు కేంద్రంగా గుంటూరు దాదాపు ఖరారైంది. ఈ జిల్లాలోనే క్రీడా సంస్థలు నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత చూపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎన్)ను నెలకొల్పేందుకు రాజీవ్ గాంధీ ఖేల్ యోజన (ఆర్ జీకేఏ) కార్యాలయం ముందుకు వచ్చింది. రాజధాని ప్రాంతంలో ఎన్ఐఎన్ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనతో శాప్ ఎండీ చక్రవర్తి గుంటూరుపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో భూముల కోసం అన్వేషించాలని జిల్లా డీఎన్ డీవోను ఆదేశించారు. వీటన్నింటితో పాటు గురజాలలో క్రీడా విశ్వవిద్యాలయం నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇందుకోసం స్థలాన్ని కూడా ఇప్పటికే గుర్తించారు. అటు శాప్ కార్యాలయాన్ని గుంటూరులోని బీఆర్ స్టేడియానికి వీలున్నంత తొందరలో తరలించాలని చూస్తున్నారు.