: అమితాబ్ అభిమానులకు టెన్నిస్ స్టార్ ఫెదరర్ ఝలక్
గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల వీరుడు, స్విట్జర్లాండ్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ కు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ అంటే ఎవరో తెలీదట. "మీ ఆట చూసేందుకు వచ్చిన అమితాబ్ బచ్చన్ ఎవరో తెలుసా?" అన్న ప్రశ్నకు ఫెదరర్ తెలీదంటూ బదులిచ్చాడు. దీంతో అక్కడున్న వారు అవాక్కయ్యారు. ఐపీటీఎల్ పోటీలలో ఆడేందుకు తొలిసారిగా భారత్‌కు వచ్చిన ఫెదరర్ ఇండియన్ ఏసెస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సింగపూర్ స్లామర్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం ఫెదరర్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది వింబుల్డన్ టోర్నీ సందర్భంగా రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా కూడా మ్యాచ్ చూసేందుకు వచ్చిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎవరో తనకు తెలీదంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో సచిన్ అభిమానులు సోషల్ మీడియాలో షరపోవాపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.